సోను సూద్ కు అరెస్ట్ వారెంట్
సాక్షం చెప్పడానికి రాలేదని జారీ చేసిన లూథియాన కోర్టు
Advertisement
ప్రముఖ నటుడు సోను సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చీటింగ్ కేసులో సాక్షం చెప్పడానికి ఆయన హాజరుకాకపోవడంతోనే పంజాబ్ లోని లూథియాన కోర్టు మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. లుథియానకు చెందిన మోహిత్ శుక్లా రూ.10 లక్షలు ఫేక్ రిజిక కాయిన్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయారని రజేశ్ కన్నా అనే లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సోనుసూద్ హాజరై సాక్షం చెప్పాలని గతంలోనే సమన్లు జారీ చేశారు. సోను విచారణకు హాజరుకాకపోవడంతో మెజిస్ట్రేట్ శుక్రవారం అరెస్టు వారెంట్ జారీ చేశారు. తనపై అరెస్టు వారెంట్ జారీపై ఈనెల 10న పూర్తి వివరాలను తన న్యాయవాదులు వెల్లడిస్తారని సోనుసూద్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ కేసులో వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని వెల్లడించారు.
Advertisement