బెయిల్ పై వచ్చి బాధితురాలిపై మళ్ళీ అత్యాచారం చేసిన దుర్మార్గుడు

అత్యాచారం కేసులో జైలుకెళ్ళిన ఓ దుర్మార్గుడు బెయిల్ పై వచ్చి మళ్ళీ బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ ఘటనను వీడియో తీసి కేసు ఉపసంహరించుకోకపోతే సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తాననని బ్లాక్ మెయిల్ చేశాడు.

Advertisement
Update:2022-08-04 14:17 IST

దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలను బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి అత్యాచారాన్ని ఆయుధంగా వాడుకునే దుర్మార్గులు పెరిగిపోతున్నారు. ఓ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి రెండేళ్ళ తర్వాత జైలు నుండి బెయిల్ పై వచ్చి మళ్ళీ అదే మహిళపై అత్యాచారం చేసిన దారుణ‌ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో వివేక్ పటేల్ అనే యువకుడు 2020 లో 17 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఏడాది తర్వాత బెయిల్ పై విడుదలైన వివేక్ పటేల్ ఆ బాలికపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. అంతేకాక తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించాలని ప్లాన్ వేశాడు.

సమయం కోసం ఎదిరిచూసిన వివేక్ పటేల్ నెల రోజుల క్రితం ఆ అమ్మాయి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన స్నేహితుడితో కలిసి అమ్మాయి ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి ఇద్దరు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ వ్యవహారాన్నంతా వీడియో తీశారు. కేసును ఉపసంహరించుకోకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. 

దీంతో ఆ అమ్మాయి భయపడిపోయింది. అయితే మెల్లెగా తేరుకొని నెల రోజుల తర్వాత పోలీసులకు పిర్యాదు చేసింది. ఆ యువతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆసిఫ్ ఇక్బాల్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News