కూలిన హెలికాప్టర్‌.. ముగ్గురు మృతి

మహారాష్ట్ర పూణెలోని బవ్‌ధాన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన

Advertisement
Update:2024-10-02 10:10 IST

మహారాష్ట్ర పూణెలోని బవ్‌ధాన్‌ ప్రాంతంలో హెలిక్టాపర్‌ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై పింప్రి చించ్వాడ్‌ పోలీసులు విచారణ చేపట్టారు. రెండు ఆంబులెన్స్‌లు, అగ్నిమాపక దళాలు సంఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఒక ఇంజనీర్ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

బవ్‌ధాన్ ప్రాంతంలోని కొండ భూభాగంలో సమీపంలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ బయలుదేరిన తర్వాత ఉదయం 6:45 గంటలకు ఈ సంఘటన జరిగింది.హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులున్నారని, వారిలో ఇద్దరు పైలట్లు, పరమజిత్ సింగ్, జీకే పిళ్లై, ఒక ఇంజనీర్ ప్రీతమ్ భరద్వాజ్ గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హెలికాప్టర్‌ హెరిటేజ్‌ ఏవియేషన్‌ పూణెలో ఉన్నది. దీనికి వీటీ ఈవీవీ రిజిస్ట్రేషన్‌ ఉన్నదని పోలీసులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News