నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
నేటితో ముగియనున్న న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయన్ను అరెస్టు విషయం విదితమే. న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనున్నది. ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేడు కోర్టుకు హాజరుకానున్నారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని తెలుపనున్నారు.
అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్లాల్సి ఉండగా.. ఆన్‌లైన్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాదలు కోర్టును కోరారు. న్యాయమూర్తి అనుమతించడంతో అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరుకానున్నారు. అంతకుముందు కోర్టుకు అల్లు అర్జున్ వస్తారనే సమాచారంతో తొలుత అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.