84 లక్షల వాట్సాప్‌ ఎకౌంట్లపై వేటు

ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు

Advertisement
Update:2024-10-15 15:38 IST

పరస్పరం సమాచారం పంచుకోవడం కోసం దేశంలో కోట్లాది మంది ప్రజలు వాట్సాప్‌ అప్లికేషన్‌ ఉపయోగిస్తున్నారు. ఆన్రాయిడ్‌, ఐవోఎస్‌ మొబైళ్లలో ఉచితంగానే వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్‌ ఫోన్లలో వాట్సాప్‌ అప్లికేషన్‌ డౌన్‌ లోడ్‌ చేసుకునే సమయంలోనే ప్రైవసీ పాలసీ ఫాలో అవుతామని డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పాలసీలో పేర్కొన్న నిబంధనలను వినియోగదారులు పాటించి తీరాలి. ప్రైవసీ పాలసీలోని నిబంధనలు ఉల్లంఘించారని చెప్తూ దేశ వ్యాప్తంగా ఒక్క నెలలోనే 84 లక్షలకు పైగా ఎకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ యాక్ట్‌, 2021ని ఉల్లంఘించిన 84.58 లక్షల మంది ఎకౌంట్లను ఆగస్టు నెలలో బ్యాన్‌ చేసినట్టు వాట్సాప్‌ ప్రకటించింది. 16.61 లక్షల ఎకౌంట్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిషేధించామని వెల్లడించింది. ప్రజలను మోసం చేసేలా బల్క్‌ మెసేజ్‌ లు పంపడం, అసాధారణ మెసేజ్‌లను ఇతరులకు చేరవేయడం లాంటివి చేస్తున్న వారిని తమ ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ ద్వారా గుర్తించి చర్యలు చేపట్టామని వెల్లడించింది. 

Tags:    
Advertisement

Similar News