మోమోస్‌ తిన్న 20 మందికి తీవ్ర అస్వస్థత.. ఒకరు మృతి

బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో చోటుచేసుకున్నఈ ఘటన

Advertisement
Update:2024-10-28 13:52 IST

మోమోస్‌ తిని మహిళ మృతి చెందింది. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో చోటుచేసుకున్నది. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరధిలోని నందినగర్‌, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్‌ కాలనీ లో శుక్రవారం జరిగిన మార్కెట్‌లో మోమోస్‌ అమ్మారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు. వీరందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో బంజారాహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నది. మోమోస్‌ తిన్న వారిలో సుమారు 10 మంది మైనర్లు ఉన్నారు. రేష్మ బేగం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమె మృతి చెందారు. ఈ సంఘటనపై ఇప్పటికే బాధితులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మోమోస్‌ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. మోమోస్‌తో పాటు ఇచ్చే మయోనైజ్‌, మిర్చి చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News