Writer Padmabhushan Release Date: మరో వారంలో ఓటీటీలోకి రైటర్ పద్మభూషణ్

Writer Padmabhushan Movie Release Date: రీసెంట్ హిట్స్ లో ఒకటి రైటర్ పద్మభూషణ్. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.

Advertisement
Update:2023-03-11 07:49 IST

సుహాస్ హీరోగా నటించిన సినిమా రైటర్ పద్మభూషణ్. సుహాస్ కెరీర్ లో తొలి థియేట్రికల్ మూవీ ఇదే. ఈ సినిమా కోసం గట్టిగా ప్రచారం చేశారు. దాదాపు మూవీ బడ్జెట్ తో సమానంగా ప్రమోషన్ కోసం ఖర్చు చేశారు. వాళ్ల ప్రయత్నాలు ఫలించాయి. థియేటర్లలో రైటర్ పద్మభూషణ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఎమోషనల్ కంటెంట్ తో, తల్లికొడుకు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే టైమ్ లో సినిమా రన్ కూడా ముగిసింది. ఈ క్రమంలో త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది.

రైటర్ పద్మభూషణ్ నాన్-థియేట్రికల్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది. ఈనెల 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కు పెట్టనుంది. ఓటీటీలో కూడా ఇది పెద్ద హిట్ అవుతుందని ఆ సంస్థ ఆశిస్తోంది.

రైట‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటున్న యువ‌కుడు.. త‌న మ‌ర‌దలితో ప్రేమ‌లో ప‌డతాడు. వారికి పెళ్లి కుదురుతుంది. అంత‌లోనే మ‌రో వ్య‌క్తి ఆ అబ్బాయి పేరు మీద‌ ర‌చ‌న‌లు చేస్తుంటాడు. అదెవర‌నేది సినిమాలో ప్ర‌ధాన‌మైన అంశం. ఓ వైపు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు మ‌ద‌ర్ సెంటిమెంట్ మిక్స్ అయిన‌ మంచి మెసేజ్‌ను ఒరియెంటెడ్ చిత్రంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అల‌రించిందీ చిత్రం.

Tags:    
Advertisement

Similar News