Boyapati - బోయపాటి నెక్ట్స్ సినిమాలో హీరో ఎవరు?

Boyapati - స్కంద ఫ్లాప్ తర్వాత గీతా కాంపౌండ్ లోకి చేరారు బోయపాటి. సినిమా కూడా ప్రకటించారు. ఇంతకీ హీరో ఎవరు?

Advertisement
Update:2024-01-30 22:21 IST

ఊహించని విధంగా మరోసారి గీతాఆర్ట్స్ ఆఫీస్ లో కనిపించారు బోయపాటి. అల్లు అరవింద్ నిర్మాతగా సినిమా చేయబోతున్నట్టు ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్రకటన మాత్రమే చేశారు. హీరో ఎవరనేది సస్పెన్స్ లో పెట్టారు.

గీతాఆర్ట్స్ బ్యానర్ పై గతంలో బన్నీ హీరోగా సరైనోడు సినిమా చేశారు బోయపాటి. కాబట్టి వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే అల్లు అర్జున్ ఖాళీగా లేడు. ప్రస్తుతం పుష్ప-2 చేస్తున్నాడు. ఆ తర్వాత అట్లీ సినిమా ఉంది. సందీప్ రెడ్డి వంగ మూవీ కూడా లైన్లో ఉంది.

గతంలో చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమా చేశాడు బోయపాటి. ఆ సినిమా ఫ్లాప్ తో ఎలాగైనా చరణ్ కు మరో హిట్టిస్తానని అన్నారు బోయపాటి. సో.. రామ్ చరణ్ తో కూడా ఆయన సినిమా చేసే ఛాన్స్ ఉంది. అయితే చరణ్ కూడా బిజీ. బుచ్చిబాబు సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.

ఇక బోయపాటి, సాయిధరమ్ తేజ్ కాంబో కూడా ఎప్పట్నుంచో నలుగుతోంది. ప్రస్తుతానికైతే తేజ్ ఖాళీగానే ఉన్నాడు. అయితే సాయితేజ్ తో బోయపాటి సినిమా చేస్తాడా అనేది సస్పెన్స్. ఇక అల్లు అరవింద్ విషయానికొస్తే, బయట హీరోలతో కూడా త్వరలోనే సినిమాలు చేస్తానని ప్రకటించారు. సో.. బోయపాటి హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Tags:    
Advertisement

Similar News