Gaami | దూసుకుపోతున్న విశ్వక్ సేన్ సినిమా

Vushwak Sen's Gaami - థియేటర్ల నుంచి ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది గామి.

Advertisement
Update:2024-04-21 13:31 IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమా జీ5లో సంచలనాలు సృష్టిస్తోంది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

జీ5లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి గామి దూసుకెళ్తోంది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ చిత్రం ఆడియెన్స్‌కు అతి తక్కువ కాలంలో చేరువైంది. స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ దక్కించుకుంది ‘గామి’.

‘గామి’ అంటే యాత్రికుడు.. కథ విషయానికి వస్తే .. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది.

ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగుంది.

నిజానికి ఈ సినిమా థియేటర్లలో ఆడలేదు. సినిమా చాలా స్లోగా ఉందనే టాక్ తో చాలామంది థియేటర్లకు వెళ్లలేదు. అలా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో సినిమా చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News