Vishwak Sen | కించపరచడం తప్పు అంటున్న విశ్వక్ సేన్

Vishwak Sen - బేబి సినిమాపై మరోసారి స్పందించాడు హీరో విశ్వక్ సేన్. ఈసారి సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement
Update:2023-07-27 20:03 IST

బేబి సినిమాపై ఆమధ్య పరోక్షంగా స్పందించిన విశ్వక్ సేన్, తాజాగా ప్రత్యక్షంగా రియాక్ట్ అయ్యాడు. బేబి సినిమా దర్శకుడు సాయిరాజేష్, తనకు కథ చెప్పడానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని, కానీ తను ఇతర పనుల్లో బిజీగా ఉండి కథ వినడానికి నిరాకరించానని అంగీకరించాడు. అంతమాత్రానికే కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నాడు.

"నాలాంటి వాళ్లు చిన్న హీరో అయినా చేస్తున్న పనిలో బిజీతో కొన్ని సందర్భాల్లో ఎవరికీ టైమ్‌ ఇవ్వలేం. కథలు వినలేం. తెలుగులో ఏ సినిమా హిట్‌ అయినా ఎక్కువ శాతం ఆనందించేవాళ్లు ఉంటారు. ఏడ్చేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. ఇటీవల నాపై కొన్ని మీమ్స్‌ వచ్చాయి. కథ చెబుతానంటే టైమ్‌ ఇవ్వలేదు.. వినలేదు అని. గంట సేపు ఓ మనిషికి కూర్చోబెట్టి తిరస్కరించడం ఇష్టం లేక నా నోటి నుంచి వచ్చిన జవాబు అది. చిన్న సినిమాగా మొదలైన ఆ చిత్రం పెద్ద హిట్‌ అయితే ఆనందించాను. డైరెక్టర్స్‌ గ్రూప్‌లో ఆ చిత్రం ట్రైలర్‌ రాగానే బావుందని మొదట స్పందించింది నేనే. ఆ చిత్రం నేను చేయాలి. కానీ కుదరలేదు. మన సినిమా బాగుంటే తల ఎత్తుకునేలా ఉండాలి. మన సినిమా బాగుందని ఎవరినో కించపరచవద్దు. అదొకటి నాకు బాధ అనిపించింది’’

ఇలా బేబి సినిమాపై నేరుగా స్పందించాడు విశ్వక్ సేన్. ఇకనైనా అనవసర వ్యాఖ్యల్ని పక్కనపెట్టి.. సక్సెస్ ను ఎంజాయ్ చేయాలని, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో సక్సెస్ కోసమే కష్టపడతారని సూచించాడు విశ్వక్ సేన్.

Tags:    
Advertisement

Similar News