Vishwak Sen | ఈ సినిమా వచ్చింది.. ఆ సినిమా పోయింది

Vishwak Sen - విశ్వక్ సేన్ సినిమాల ఆర్డర్ మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరోసారి వాయిదా పడింది. గామి వస్తోంది.

Advertisement
Update:2024-02-08 08:28 IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అరంగేట్రం నుండి ప్రత్యేకమైన చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అతని రాబోయే చిత్రం గామి కూడా ఇలాంటిదే. విభిన్నమైన కథాంశం ఇది. ఇందులో అతడు అఘోరాగా నటిస్తున్నాడు.

మేకర్స్ ఇటీవల హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించడం ద్వారా సినిమా ప్రమోషన్‌లను ప్రారంభించారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించాడు. మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ వదిలారు.

మహాశివరాత్రిని టార్గెట్ చేసుకుని, మేకర్స్ తేదీని లాక్ చేశారు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే.. గామి రాకతో, విశ్వక్ సేన్ మరో చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పుడు మార్చి 8న రేసు నుండి తప్పుకున్నట్టయింది.

ఇంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను మార్చి 8కి ప్రకటించారు. గామి రావడంతో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరోసారి వాయిదా పడినట్టయింది.

గామి విషయానికొస్తే... ఈ చిత్రంలో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నాడు. “అతని అతి పెద్ద భయం, మానవ స్పర్శ... అతని గాఢమైన కోరిక, మానవ స్పర్శ కూడా” అనే లైన్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గామికి విద్యాధర్ కగిత దర్శకత్వం వహించాడు. చాందినీ చౌదరి హీరోయిన్.

Tags:    
Advertisement

Similar News