Vishwak Sen | పోలీస్ గా విశ్వక్ సేన్

Vishwak Sen - విశ్వక్ సేన్ పోలీస్ గా మారాడు. కొత్త సినిమా ప్రకటించాడు. వివరాలు చూద్దాం

Advertisement
Update:2024-08-06 21:22 IST

విశ్వక్ సేన్ ఖాకీ చొక్కా వేస్తే ఎలా ఉంటుంది? అతడు పోలీస్ గెటప్ లో ఓ సినిమా చేస్తే చూడాలని చాలామందికి ఉంది. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. విశ్వక్ సేన్ మరో సినిమా ప్రకటించాడు. ప్రీ-లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఇందులో పోలీస్ గా కనిపిస్తున్నాడు విశ్వక్. కాన్సెప్ట్ పోస్టర్ లో అతడి నడుముకి తుపాకి ఉంది. కెరీర్ లో విశ్వక్ సేన్ కు ఇది 13వ చిత్రం. భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీధర్ గంటా దర్శకుడు. 'దసరా' లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత. సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

విశ్వక్ సేన్ ప్రస్తుతం తన 'మెకానిక్ రాకీ'ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్ చివరి వారంలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా రిలీజైన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ గా విశ్వక్ నటిస్తున్న సినిమా డీటెయిల్స్ బయటకు వస్తాయి.

ఈ మూవీతో పాటు.. లైలా అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు విశ్వక్ సేన్. మెకానిక్ రాకీ తర్వాత ఏ సినిమా వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ 2 సినిమాల తర్వాత తన స్వీయ దర్శకత్వంలో హీరోగా దాస్ కా ధమ్కీ సీక్వెల్ చేయబోతున్నాడు విశ్వక్. 

Tags:    
Advertisement

Similar News