కొత్త సినిమా ప్రారంభించిన వరుణ్ తేజ్

ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. ఆ కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది.

Advertisement
Update:2022-09-19 18:22 IST

తమ తొలి తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'మేజర్'తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ తో కలసి వరుణ్ తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో భారీ యాక్షన్ డ్రామాతో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురాబోతోంది. ఈ చిత్రంతో వరుణ్ తేజ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్తుంది.

ఈ రోజు హైదరాబాద్ లోని చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. వరుణ్ తేజ్ తల్లి పద్మజా కొణిదెల కెమెరా స్విచాన్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. దేశభక్తి తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్.

ఈ చిత్రం తెలుగు. హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ ఏడాది నవంబర్ లో సెట్స్‌పైకి రానున్న ఈ మూవీని, 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. హీరోయిన్ తో పాటు ఇతర టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.

Tags:    
Advertisement

Similar News