Sudheer Babu | ఇలాంటి సినిమా రాలేదంటున్న సుధీర్ బాబు

Sudheer Babu - హరోంహర సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు సుధీర్ బాబు. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదంటున్నాడు.

Advertisement
Update: 2024-06-12 17:01 GMT

హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు.

ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అలరించగా.. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో సుధీర్ బాబు సినిమా గురించి మాట్లాడాడు.

"మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఏమ్ ఫర్ ది లెవంత్ మైల్' అని డైలాగ్ ఉంటుంది. నేను 12వ మైల్ కి గురి పెట్టాను. కొట్టాను. ఒక సాలిడ్ సినిమా తీసి, ఎంతో మందికి చూపించి, వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాను. ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోతుంది, ఈ ఫ్రేం ఎలా చూస్తే అదిరిపోతుందనే అప్రోచ్ తో ఈ సినిమా చేశాం. ట్రైలర్ లో చూస్తున్న ప్రతి ఫ్రేమ్ లో టీం అందరి ఎఫర్ట్ ఉంది. ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఎలాంటి సినిమా రాలేదు. సినిమా చూసినప్పుడు ఆడియన్స్ ఇదే ఫీల్ అవుతారు."

మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హీరో చిత్తూరు యాసలో మాట్లాడతాడు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో హీరో, తుపాకులు తయారుచేసే వ్యక్తిగా కనిపిస్తాడు.

Tags:    
Advertisement

Similar News