సమంత చికిత్సకు రూ.25 లక్షలు ఇచ్చా నిర్మాత షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు 25 లక్షలు ఇచ్చానని నిర్మాత బెల్లంకొండ సురేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement
Update:2024-12-05 21:04 IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు 25 లక్షలు ఇచ్చానని నిర్మాత బెల్లంకొండ సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి సినిమాలో అల్లుడు శ్రీను సమయంలో హీరోయిన్ సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఈ మూవీ నిర్మాత బెల్లకొండ సురేష్ ఓ ఇంటర్వూలో తెలిపారు. ట్రీట్‌మెంట్‌కు అవసరమైన డబ్బులు నిర్మాతలేవరు ఇవ్వలేదు. నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కొసం సినిమా అయ్యేదాక పైవ్ స్టార్ హాటల్‌లో ఉంచామని ఆయన తెలిపారు.

నాలుగు నెలలకు కొలుకున్నా ఇప్పటికీ ఆ సాయాన్ని ఆమె మరచిపోలేదని సురేష్ పేర్కొన్నారు. సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ సమస్య ముదిరిన తర్వాత అందరితో చెప్పుకుంది సమంత. తర్వాత విదేశాలకు కూడా వెళ్లి ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేసింది. ఫలితంగా ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది.ఇక సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో కూడా సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని, ఆ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News