కృష్ణంరాజు స్మారక కార్యక్రమం.. అదిరిన వంటకాలు

ప్రభాస్ కు ఆత్మీయ స్వాగతం పలికింది మొగల్తూరు గ్రామం. కృష్ణంరాజు స్వస్థలమైన ఈ ఊరిలో ఆయన స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ భోజనం పెట్టాడు ప్రభాస్. కృష్ణంరాజుకు ఇష్టమైన వంటకాలన్నీ ఇందులో ఉన్నాయి.

Advertisement
Update:2022-09-30 09:00 IST

ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం కృష్ణంరాజు స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి మొగల్తూరు వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు.

ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు ఊరికి రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా వారికి స్వాగతం పలికారు. తాము ఎంతగానో అభిమానించే కృష్ణంరాజు భౌతికంగా దూరమవ్వడం స్థానికుల్లో ఉద్వేగాన్ని నింపింది.

స్మారక కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వచ్చిన వారిని పలకరించి, అభివాదం చేశాడు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా తినేందుకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరినీ లంచ్ చేసి వెళ్లమని కోరాడు.

కృష్ణంరాజుకు ఇష్టమైన వంటకాలన్నీ లంచ్ లో పెట్టారు. వచ్చిన వాళ్లకు 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు, 1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు వడ్డించారు. ఇలా 22 రకాల నాన్-వెజ్ వంటకాలతో ప్రజలకు భోజనం పెట్టాడు కృష్ణంరాజు.






Tags:    
Advertisement

Similar News