2 నెలలు హోం వర్క్.. 40 రోజుల్లో పని పూర్తి

చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సినిమాకు సంబంధించి తన అనుభవాల్ని పంచుకున్నాడు.

Advertisement
Update:2022-10-07 13:15 IST

గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి పెర్ఫార్మెన్స్ కు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, ఆ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కూడా అంతే మంచి స్పందన వచ్చింది. చాలామంది సినిమాలో ఇద్దరు హీరోలున్నారని, ఒకటి చిరంజీవి, రెండో హీరో తమన్ అంటూ పొగుడుతున్నారు.

గాడ్ ఫాదర్ కు వస్తున్న స్పందనపై పూర్తి ఆనందం వ్యక్తం చేశాడు తమన్. తన హార్డ్ వర్క్ కు సరైన గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డాడు. ఓ సంగీత దర్శకుడిగా కంటే, చిరంజీవి అభిమానిగా గాడ్ ఫాదర్ కు పని చేశానని, అందుకే ఇంత మంచి ఔట్ పుట్ వచ్చిందని చెబుతున్నాడు.

"నేపధ్య సంగీతం, డాల్బీ మిక్సింగ్ అంతా కలుపుకొని ఈ సినిమాని పూర్తి చేయడానికి 40 రోజులు పట్టింది. ఇది తక్కువ సమయంలో పూర్తి చేసినట్లే లెక్క. అయితే ఈ సినిమా కోసం నేను, దర్శకుడు మోహన్ రాజా దాదాపు 2 నెలలు హోం వర్క్ చేశాం. కాబట్టి త్వరగా పూర్తి చేయగలిగాం. చిరంజీవి గారు, నయనతార మధ్య వచ్చే బ్రదర్ సెంటిమెంట్ పాట లూసిఫర్ లో లేదు. గాడ్ ఫాదర్ లో అది మంచి ప్లేస్ మెంట్ లో కుదిరింది. లూసిఫర్ లో మ్యూజిక్ ఏమీ గుర్తుండదు. కానీ గాడ్ ఫాదర్ లో గుర్తుపెట్టుకునే మ్యూజిక్ చేయడం గొప్ప అనందాన్ని ఇచ్చింది."

ఇలా గాడ్ ఫాదర్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ను మీడియాతో పంచుకున్నాడు తమన్. అల వైకుంఠపురములో తరహాలోనే, గాడ్ ఫాదర్ లో కూడా ఫైట్ వచ్చిన సందర్భంలో పాట పెట్టారు. అది తన ఐడియానేనని, తన ఆలోచనకు అంతా పూర్తిగా సహకరించారని చెప్పుకొచ్చాడు ఈ మ్యూజిక్ డైరక్టర్.

Tags:    
Advertisement

Similar News