ఆ స్టార్ హీరోతో వ‌న్స్ మోర్ అంటున్న స‌మంత‌

స‌మంత చేతికి తాజాగా ఇంకొక క్రేజీ ప్రాజెక్ట్ వ‌చ్చింది. త‌మిళ‌ అగ్ర హీరో విజయ్ 69వ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా ఖరారైన‌ట్లు ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Update: 2024-07-02 07:50 GMT

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత చిన్న గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్ ల‌ను లైన్ లో పెడుతోంది. ఇటీవ‌ల త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మా ఇంటి బంగారం పేరుతో ఒక మూవీని అనౌన్స్ చేసింది. స‌మంత స్వీయ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ఇది. అలాగే బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మ్యాన్‌, సిటాడెల్‌:హనీ బన్నీ సిరీస్‌ల త‌ర్వాత మ‌రోసారి ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్‌ అండ్‌ డీకేలతో ఒక కొత్త సిరీస్ కు ఒప్పుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. స‌మంత చేతికి తాజాగా ఇంకొక క్రేజీ ప్రాజెక్ట్ వ‌చ్చింది. త‌మిళ‌ అగ్ర హీరో విజయ్ 69వ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా ఖరారైన‌ట్లు ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కోలీవుడ్ లో విజ‌య్‌-స‌మంత జోడి హిట్ పెయిర్ లిస్ట్ లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రూ క‌లిసి కత్తి, తేరి, మెర్సల్ చిత్రాలు చేశారు. ఈ మూడు సినిమాలు బాక్సాఫిక్ వ‌ద్ద విజ‌య‌వంతం అవ్వ‌డ‌మే కాకుండా విజ‌య్‌, స‌మంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఇక ఇప్పుడు విజ‌య్ తో స‌మంత వ‌న్స్ మోర్ అంటోంది. 2026 త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌య్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పోటీ చేయనుంది. రాజకీయ అరంగేట్రానికి విజ‌య్ ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న చివ‌రి చిత్రంగా విజ‌య్ 69 చేయ‌బోతున్నారు.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హెచ్‌.వినోద్ ద‌ర్శ‌కుడు. తెలుగు బ‌డా నిర్మాణ సంస్థ డీవీవీ బ్యాన‌ర్‌లో డీవీవీ దానయ్య విజ‌య్ 69 మూవీని నిర్మించ‌బోతున్నారు. తాజాగా ఈ చిత్రంలో క‌థానాయిక‌గా స‌మంత‌ను తీసుకున్నార‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖ‌రారు అయింద‌ని.. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఉంటుంద‌ని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News