2024 ఆస్కార్ నామినేషన్స్ కు తెలుగు సినిమా

ఆస్కార్ అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ మన దేశ చిత్రాలకు నిరాశే ఎదురయ్యేది.

Advertisement
Update:2024-01-19 20:02 IST

ఆస్కార్ అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ మన దేశ చిత్రాలకు నిరాశే ఎదురయ్యేది. ఇక్కడ తీసే సినిమాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వరని భావిస్తున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(2022) సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది.

గత ఏడాది నిర్వహించిన 95వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు మొదటిసారి ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ పాట రచయిత చంద్ర బోస్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాతో పాటు మన దేశం నుంచే ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ ఫిలిం కూడా ఆస్కార్ అవార్డు అందుకుంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు తెలుగు నుంచి మరో సినిమా ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైంది. నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమా 2024 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కు ఎంపికైంది.

ఇక తమిళ్ నుంచి విడుదలై పార్ట్ 1, ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక కాగా, హిందీ నుంచి షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ, ది స్టోరీ టెల్లర్, సంగీత పాఠశాల, శ్రీమతి చటర్జీ vs నార్వే, 12th ఫెయిల్, గూమర్, జ్విగాటో, రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, కేరళ స్టోరీస్ సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక అయ్యాయి.

Tags:    
Advertisement

Similar News