Adipurush Ticket Price Hike: ఆదిపురుష్ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతి
Adipurush Movie Ticket Price Hike: సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్ ధర రూ.175 ఉండగా, తాజా ఉత్తర్వులతో దీనికి అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 3డీ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో గ్లాస్‌లకు అదనపు ధర చెల్లించాలి.;
Adipurush Ticket Price Hike: ఆదిపురుష్ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతి
ప్రభాస్ రాముడిగా నటించిన తాజా చిత్రం `ఆదిపురుష్` ఈ నెల 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మొదటి మూడు రోజులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతించింది.
అగ్ర కథానాయకుల సినిమాలు విడుదలైనప్పుడు నిబంధనల మేరకు మొదటివారం టికెట్ ధరలను పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే.
సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్ ధర రూ.175 ఉండగా, తాజా ఉత్తర్వులతో దీనికి అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 3డీ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో గ్లాస్‌లకు అదనపు ధర చెల్లించాలి. మల్టీప్లెక్స్ లో రూ. 295 + 3డీ గ్లాస్ చార్జీ వసూలు చేయనున్నారు.
దీంతో పాటు ఆరో షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 4 గంటల నుంచి ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించవచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరపై రూ.50 పెంచినట్టు సమాచారం. అయితే ఇది అధికారికంగా వెలువడాల్సి ఉంది.