బన్నీని చూసి కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్‌

బాధిత కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానన్న అల్లు అర్జున్‌

Advertisement
Update:2024-12-14 12:43 IST

క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపారు. చంచల్‌ గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలతో నా హృదయం నిండింది. నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అల్లు అర్జున్‌ అన్నారు. సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న ఘటన గురించి మాట్లాడుతూ.. దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఆ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటాను. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు. ప్రమాదవశాత్తు జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఇది చోటు చేసుకున్నది. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్‌కు నేను వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు అక్కడ సినిమాచూశాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున దీనికి గురించి మాట్లాడాలనుకోవడం లేదన్నారు.

జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక-నిర్మాతలు, హీరోలు కలిశారు. తొక్కిసలాట ఘటన, అరెస్ట్, తాజా పరిణామాల గురించి చర్చించారు. అల్లు అర్జున్‌ కలిసి వారిలో డైరెక్టర్లు కె. రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్‌, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ తదితరులు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లిన వీరంతా తాజా పరిణామాల గురించి చర్చించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలోనే డైరెక్టర్‌ సుకుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే బన్నీ ఆయనను ప్రేమగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.




 

తన మేనల్లుడు, నటుటు అల్లు అర్జున్‌ను చిరంజీవి సతీమణి సురేఖ కలిశారు. శనివారం ఉదయం అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లి ఆమె బన్నీని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. తాజా పరిణామాల గురించి మాట్లాడి పరామర్శిచారు. బన్నీని హత్తుకుని సురేఖ ఎమోషనల్‌ కాగా... ఆయన ధైర్యం చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News