Srinivas Avasarala | హారర్ సినిమాలు నచ్చవంటున్న నటుడు

Srinivas Avasarala - పిండం సినిమాలో కీలక పాత్ర పోషించాడు అవసరాల శ్రీనివాస్. ఇదొక స్పెషల్ మూవీ అంటున్నాడు.

Advertisement
Update:2023-12-14 07:31 IST

హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై స్పందించాడు అవసరాల శ్రీనివాస్. హారర్ కథలు తనకు నచ్చకపోయినా ఇందులో నటించానని తెలిపాడు.

"నేను మామూలుగా హారర్ సినిమాలను పెద్దగా ఇష్టపడను. అయితే అనుకోకుండా ప్రేమ కథా చిత్రమ్ థియేటర్ లో చూస్తున్నప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయాను. కొంచెం భయపెడితే జనాలు శ్రద్ధగా సినిమా చూస్తారని అర్థమైంది. అయితే కేవలం భయపెట్టడమే కాకుండా, ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా ఉండాలనేది నా అభిప్రాయం. అలాంటి సినిమానే ఈ పిండం."

తను నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటన మీదే దృష్టి పెడతానంటున్నాడు అవసరాల. దర్శకులకు సూచనలు-సలహాలు ఇవ్వనంటున్నాడు. "నటుడిగా సెట్ మీదకు వెళ్ళినప్పుడు నేను నేర్చుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఒక్కొక్క దర్శకుడిది ఒక్కో పద్ధతి. కొందరికి కొన్ని జానర్ల మీద ఎక్కువ పట్టు ఉంటుంది. అందుకే నేను సెట్ కి వెళ్ళినప్పుడు చెప్పడం కంటే, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికే ప్రయత్నిస్తాను." అని క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు కమ్ దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News