Samantha | ఎట్టకేలకు సెట్స్ పైకి సమంత

Samantha - 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సమంత మళ్లీ సినిమాల్లోకి వస్తోంది. ఈ నెల్లోనే కొత్త సినిమా స్టార్ట్ చేయబోతోంది.

Advertisement
Update:2024-06-13 22:39 IST

ఖుషి తర్వాత మళ్లీ సినిమా చేయలేదు సమంత. అలా ఆమె కెరీర్ లో ఇప్పటికే 10 నెలలు గ్యాప్ వచ్చేసింది. మరోవైపు ఆమె కోలుకుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, సమంత తన సినిమాను ప్రకటించింది.

కెరీర్ లో తొలిసారిగా మలయాళం సినిమా చేయబోతోంది సమంత. తనకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరో. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెలాఖరు నుంచి ప్రారంభించబోతోంది సమంత.

మరోవైపు ఆమె నిర్మాతగా ఓ సినిమా ప్రకటించింది. ఆ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేసుకుంది. త్వరలోనే ఆ మూవీని ప్రకటించబోతోంది. ఇలా ఒకేసారి 2 సినిమాతో సందడి చేయబోతోంది ఈ బ్యూటీ.

మయొసైటిస్ నుంచి ఆమె కోలుకున్నప్పటికీ సైడ్ ఎఫెక్టులు బాధిస్తున్నాయి. దీంతో వాటి నుంచి బయటపడేందుకు గ్యాప్ తీసుకుంది సమంత. ఇప్పటికీ ఆమె ఏదో ఒక చికిత్స తీసుకుంటూనే ఉంది. అలా ఓవైపు చికిత్స కొనసాగిస్తూనే, మరోవైపు సినిమాలు రీస్టార్ట్ చేసింది సమంత.

Tags:    
Advertisement

Similar News