Pooja Hegde | పూజా హెగ్డేను చంపేస్తామంటూ బెదిరింపులు?
Pooja Hegde - పూజా హెగ్డేకు ఈమధ్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట. నిజమేనా..?
పూజా హెగ్డేకు లైఫ్ థ్రెట్ ఉందంట. ఆమెను చంపేస్తామంటూ కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారట. అసలే అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న టైమ్ లో, ఈ వార్తలతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఈ బ్యూటీ. ఈ కథనాలపై పూజా హెగ్డే టీమ్ క్లారిటీ ఇచ్చింది.
పూజా హెగ్డేకు బెదిరింపులు అంటూ వస్తున్న కథనాలు, ఊహాగానాల్ని ఆమె టీమ్ ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఉ పుకార్లు ఎలా వచ్చాయంటే.. తాజాగా దుబాయ్ లో ఓ ఈవెంట్ కు హాజరైంది పూజా హెగ్డే. అక్కడ పెద్ద గొడవ జరిగిందట. ఆ టైమ్ లో ఆమెను కొందరు వార్నింగ్ ఇచ్చారంటూ పుకార్లు మొదలయ్యాయి.
అక్కడ్నుంచి ఈ ఊహాగానాలు మెల్లమెల్లగా విస్తరించాయి. అయితే అలాంటి గొడవలేం జరగలేదని, జరిగినా వాటితో పూజాహెగ్డేకు సంబంధం లేదని ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ఒకప్పుడు తినడానికి, నిద్రపోవడానికి కూడా టైమ్ లేకుండా షూటింగ్స్ చేసింది. అయితే హీరోయిన్స్ కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. పూజా హెగ్డే విషయంలో కూడా అదే జరిగింది. మొన్నటివరకు బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఒక్కసారిగా ఫ్రీ అయిపోయింది. సినిమాలు తగ్గిపోవడంతో చేసేదేం లేక విదేశీ పర్యటనల్లో గడిపేస్తోంది.
అలా మొన్నటివరకు వెకేషన్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి టాలీవుడ్-బాలీవుడ్ ను ఎట్రాక్ట్ చేసే పని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హాట్ హాట్ ఫొటోషూట్స్ రిలీజ్ చేస్తోంది. నిజానికి పూజాహెగ్డేకు ఫొటోషూట్స్ కొత్త కాదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ ఆమె షేర్ చేస్తూనే ఉంది. కాకపోతే ఈమధ్య వాటి జోరు పెంచింది.
కనీసం వారానికి 2 ఫొటోషూట్స్ చేయాలని నిర్ణయించుకుంది పూజాహెగ్డే. అలా సోషల్ మీడియాలో నలగడంతో పాటు, డబ్బు కూడా సంపాదించాలని ఫిక్స్ అయింది. త్వరలోనే ఆమె తమిళ్ లో ఓ సినిమా ప్రకటించే అవకాశం ఉంది.