ఆర్జీవీకి ఏపీ హైకోర్టులో ఊరట
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనకు వచ్చే సోమవారం వరుకు అరెస్ట్ చేయువద్దని ఆదేశించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన అంశంలో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడని తెలిసిందే. ఆర్జీవీ ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ..నేను పారిపోలేదు.. హైదరాబాద్‌లోని డెన్‌లో ఉన్నా. నాపై ఐదు కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉంది. నా రిప్లైపై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానన్నాడు. అరెస్ట్ చేస్తారనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. అభిప్రాయాలు తెలుసుకునేందుకు ట్వీట్లు పెట్టా. నా ట్వీట్ల వెనుక రాజకీయ దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు.