Mr Bachchan | మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే?

Mr Bachchan - రవితేజ సినిమా పాటల ప్రచారం మొదలైంది. మొదటి పాట ఇనిస్టెంట్ గా హిట్టయింది.

Advertisement
Update: 2024-07-10 17:22 GMT

డైరెక్టర్ హరీష్ శంకర్ కు మ్యూజిక్ లో మంచి టేస్ట్ ఉంది, ఆయన సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజికల్ గా హిట్ అవుతాయి. మాస్ మహారాజా రవితేజతో ప్రస్తుతం హరీష్ శంకర్ చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' కూడా పాటలతో హిట్ కొట్టబోతోంది. ప్రోమోతో ఆదరగొట్టిన తర్వాత, మేకర్స్ ఫస్ట్ సింగిల్- సితార్ లిరికల్‌ వీడియోని రిలీజ్ చేశారు. ఇనిస్టెంట్ గా హిట్టయింది ఈ సాంగ్.

సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ తర్వాత మిక్కీ జె మేయర్, హరీష్ శంకర్‌ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ పాట సితార్ సౌండ్స్ తో ప్రారంభమైంది, మంచి బీట్ తో ఉన్న మెలొడీ ఇది. కెవ్వు కేక, అస్మైక యోగ అనే రెండు చార్ట్‌బస్టర్‌ల తర్వాత, హరీష్ , లిరిక్ రైటర్ సాహితీ రీ-యూనియన్ లో వచ్చిన ఈ పాట ఆకట్టుకుంది.

సాంగ్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ కెమిస్ట్రీ బాగుంది. రవితేజ డ్యాన్స్ మూమెంట్స్ తో, భాగ్యశ్రీ తన అందాలతో ఆకట్టుకున్నారు. శేఖర్ మాస్టర్ ఈ సినిమాకు కొరియోగ్రఫీ అందించారు. కాశ్మీర్ లోయలోని అందమైన లొకేషన్లలో ఈ సాంగ్ షూట్ చేశారు.

ఈ సినిమాలో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. 

Full View

Tags:    
Advertisement

Similar News