Kubera Movie | రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్

Kubera Movie - కుబేర సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చింది. ఈసారి రష్మిక వంతు.

Advertisement
Update:2024-07-05 20:15 IST

స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల కలిసి చేస్తున్న సినిమా కుబేర. మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఇది. మూవీకి సంబంధించి ఇప్పటికే నాగ్-ధనుష్ లుక్స్ రివీల్ చేశారు. తాజాగా రష్మిక లుక్ కూడా విడుదల చేశారు.

ఈరోజు రష్మిక ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. సినిమాలో రష్మిక పాత్ర విలక్షణంగా ఉండబోతోందనే విషయం వీడియో చూస్తే అర్థమౌతుంది. వీడియోకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బాగుంది.

గ్లింప్స్ వీడియోలో డబ్బుని తవ్వి తీస్తున్న రష్మిక క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసి క్యురియాసిటీని పెంచారు. ఆకట్టుకునే విజువల్స్‌తో, శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జిమ్ సర్భ్ మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర మూవీని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Full View

Tags:    
Advertisement

Similar News