రానా దగ్గుబాటిపై సమంత ప్రశంసలు..అందుకోసమేనా ?

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సామ్ తొలిసారి కనిపించారు. హీరో రానా దగ్గుబాటిపై సమంత ప్రశంసలు కురిపించారు

Advertisement
Update:2024-10-08 21:12 IST

హైదరాబాద్‌లో జరిగిన ‘జిగ్రా’ అనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్‌లో నటి సమంత హాజరైయారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సామ్ తొలిసారి కనిపించారు. హీరో రానా దగ్గుబాటిపై సమంత ప్రశంసలు కురిపించారు. రానా..మా అన్నాయ్య అందరికీ ఆయలాంటి అన్నయ్య ఉండాలి.. పెళ్లి చేసుకున్నారు కాబట్టి అందరు బ్రదర్ అనొచ్చు ఇక అంటూ సామ్ చమత్కరించారు. తెలుగు వారి ప్రేమ వల్లే ఎదిగాను. నాకు జిగ్రాస్ అంటే నా అభిమానులే..’’ అని చెప్పుకొచ్చింది.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతు..సమంత ముంబైలోనే కాకుండా.. హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు రావాలని కోరుకుంటున్నాను. మీరు హైదరాబాద్‌లో లేరని, మీరు చేయడం లేదని మేం మీకు స్టోరీలు రాయడం లేదు. మీరు నటిస్తానంటే మేం రాస్తాం. ‘అత్తారింటికి దారేది’ లాగా సమంత కోసం ‘హైదరాబాద్‌కు దారేది’ అని అనాలేమో. అందరూ సమంత హైదరాబాద్ రావాలని ట్రెండ్ చేయాలి. ఆమె మళ్లీ తెలుగు సినిమాలలో కంబ్యాక్ ఇవ్వాలని కోరుతున్నాను’’ అన్నారు. త్రివిక్రమ్ ఇలా మాట్లాడుతుంటే.. హాజరైన వారంతా తమ క్లాప్స్‌తో సమంతకు తమ వినతిని తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News