Game Changer | చరణ్ సినిమా నుంచి కీలక అప్ డేట్

Game Changer - చరణ్-శంకర్ కాంబోలో వస్తోంది గేమ్ ఛేంజర్. ఎట్టకేలకు ఈ సినిమా షూట్ పూర్తిచేశాడు చరణ్.

Advertisement
Update:2024-07-06 23:14 IST

గేమ్ ఛేంజర్ నుంచి కీలకమైన అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అతను ఎన్నో సంవత్సరాల తర్వాత తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. దాదాపు 3 ఏళ్లుగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఎట్టకేలకు రామ్ చరణ్‌కి విముక్తి లభించింది. ఇక అతడు డబ్బింగ్, ప్రచారం పూర్తిచేస్తే సరిపోతుంది.

2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ అద్భుత విజయం తర్వాత రామ్ చరణ్ ప్రతి సంవత్సరం ఒక చిత్రాన్ని విడుదల చేస్తానని హామీ ఇచ్చాడు. అతను 2021లోనే గేమ్ ఛేంజర్ కోసం శంకర్‌తో చేతులు కలిపాడు. అప్పుడే అందరికీ నమ్మకం పోయింది. అదే ఇప్పుడు నిజమైంది.

సినిమాకు సంబంధించి మరో 10 రోజులు షూటింగ్ పెండింగ్ ఉంది. సినిమాలోని ముఖ్య తారాగణంపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. షూటింగ్ పూర్తికావడంతో, సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారేమో చూడాలి.

మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే ప్రారంభించిన బుచ్చిబాబు చిత్రానికి రామ్ చరణ్ పూర్తిగా పని చేయనున్నారు. ఈ సినిమా కోసం మేకోవర్ అవ్వడానికి, ట్రైనింగ్ తీసుకోవడానికి త్వరలోనే విదేశాలకు వెళ్లబోతున్నాడు చరణ్. 

Tags:    
Advertisement

Similar News