గేమ్ ఛేంజ‌ర్‌.. మ‌రో బిగ్ డౌట్ క్లియ‌ర్ చేసిన శంక‌ర్‌

తాజా ఇంట‌ర్వ్యూలో గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో శంక‌ర్ మ‌రో బిగ్ డౌట్ ను క్లియ‌ర్ చేశారు. భార‌తీయుడు మాదిరిగానే గేమ్ ఛేంజ‌ర్ కు పార్ట్ 2 ఉంటుందా? అని ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా.. ఆ ప్ర‌స‌క్తే లేద‌ని శంక‌ర్ తేల్చి చెప్పారు.

Advertisement
Update:2024-07-02 12:07 IST

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా చేస్తున్న 15వ చిత్రం గేమ్ ఛేంజ‌ర్‌. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రాబోతున్న గేమ్ ఛేంజ‌ర్ లో కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లు. 2021లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైనా ఇంత వ‌ర‌కు పూర్తి కాలేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం శంక‌ర్. ఆయ‌న ఓవైపు గేమ్ ఛేంజ‌ర్ తో పాటు మ‌రోవైపు భార‌తీయుడు 2 మూవీ కోసం కూడా వ‌ర్క్ చేశారు.

ఫైన‌ల్ గా క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన భార‌తీయుడు 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని జూలై 12న విడుద‌ల అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే గేమ్ ఛేంజ‌ర్ గురించి గ‌త కొంత కాలంగా ఎటువంటి అప్డేట్స్ రాక‌పోవ‌డంతో మెగా ఫ్యాన్స్ డీలా ప‌డిపోయారు. ఇలాంటి త‌రుణంలో డైరెక్ట‌ర్ శంక‌ర్ ఇటీవ‌ల భార‌తీయుడు 2 ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ సినిమా ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ని.. వీలైనంత త‌ర్వ‌గా షూటింగ్ ను కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామ‌ని తెలిపారు.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో శంక‌ర్ మ‌రో బిగ్ డౌట్ ను క్లియ‌ర్ చేశారు. భార‌తీయుడు మాదిరిగానే గేమ్ ఛేంజ‌ర్ కు పార్ట్ 2 ఉంటుందా? అని ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా.. ఆ ప్ర‌స‌క్తే లేద‌ని శంక‌ర్ తేల్చి చెప్పారు. భారతీయుడు, గేమ్ ఛేంజర్ చిత్రాలకు ఎటువంటి పొంతన, పోలిక ఉండదు. భారతీయుడుకి పార్ట్ 3 కూడా ఉంటుంది. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో రెండో భాగం ఉండదు. ఎందుకంటే పార్ట్ 2 తీసేంత‌ స్కోప్ ఆ స్టోరీకి లేదు అని శంకర్ తెలిపారు. అలాగే భారతీయుడు 2 విడుదలైన వెంటనే గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. మరో 10 నుంచి 15 రోజుల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని శంకర్ స్ప‌ష్టం చేశారు.


Tags:    
Advertisement

Similar News