Rajinikanth | రజనీ సినిమా టైటిల్ ఇదే

Rajinikanth's Coolie - రజనీకాంత్ కొత్త సినిమాకు కూలీ అనే టైటిల్ పెట్టారు. టీజర్ అదిరింది. మీరూ ఓ లుక్కేయండి.

Advertisement
Update:2024-04-23 22:52 IST

జైలర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, కెరీర్ లో రజనీకాంత్ కు 171వ సినిమా. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు.

ఈ చిత్రానికి 'కూలీ' అని పేరు పెట్టారు, టీజర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను స్టైలిష్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. అతను గోల్డ్ స్మగ్లర్ల డెన్ లోకి ప్రవేశిస్తాడు. బంగారు గడియారాలతో చేసిన గొలుసుతో వారిని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్‌ ముఠా బాస్‌కి ఫోన్‌ లో వార్నింగ్ ఇస్తాడు.

సూపర్‌స్టార్‌కి ఇది లోకేష్ కనగరాజ్ మార్క్ ఇంట్రడక్షన్. కూలీ పూర్తి యాక్షన్‌తో నిండిపోతుందని, రజనీకాంత్ తన వింటేజ్ అవతార్‌లో కనిపిస్తారని టీజర్ హామీ ఇచ్చింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.

2025లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. 

Full View

Tags:    
Advertisement

Similar News