Bhale Unnade | రాజ్ తరుణ్ నుంచి మరో సినిమా

Raj Tarun's Bhale Unnade - రాజ్ తరుణ్ నుంచి ఈ ఏడాది ముచ్చటగా మూడో సినిమా రెడీ అయింది. రిలీజ్ డేట్ కూడాప్రకటించారు.

Advertisement
Update: 2024-08-16 03:52 GMT

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ భలే ఉన్నాడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో రాజ్ తరుణ్ లుక్ అండ్ ఎక్స్ ప్రెషన్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.

ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. నగేష్ బానెల్లా డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్.

ఈ ఏడాది ఇప్పటికే రాజ్ తరుణ్ నుంచి తిరగబడరాసామీ, పురుషోత్తముడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అదే జోరులో భలే ఉన్నాడే చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నాడు రాజ్ తరుణ్. సినిమాలో రాజ్ తరుణ్ సరసన మనీషా కందుకూరు హీరోయిన్ గా నటించగా.. సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, హైపర్ ఆది, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. 

Tags:    
Advertisement

Similar News