Priyadarshi | మరో సినిమా స్టార్ట్ చేసిన ప్రియదర్శి
Priyadarshi - బలగంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, ఇప్పుడు ఇంద్రగంటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇదొక మంచి కాంబినేషన్.
2016లో నానితో 'జెంటిల్ మన్' - 2018లో సుధీర్ బాబుతో 'సమ్మోహనం'.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి - శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు.
శ్రీదేవి మూవీస్ సంస్థలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మల్లేశం, బలగం లాంటి సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి.. తన ఇమేజ్ కు తగ్గట్టు ఇంద్రగంటి కథను ఎంచుకున్నాడు. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదో క్యూట్ ఫిలిం.. స్వీట్ ఎంటర్టైనర్.. అంటున్నారు మేకర్స్. చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని... ఇప్పటి ట్రెండ్ లో జంధ్యాల గారు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఊరిస్తున్నారు. ఈ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.