Prabhas's Kalki Movie | కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్

Kalki Movie - ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించాలి?

Advertisement
Update:2024-06-21 17:38 IST

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ఇప్పుడు ఓవర్సీస్ ప్రీమియర్లలో సరికొత్త రికార్డ్ కి చేరుకుంది. దీంతో ఈ సినిమాకు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు ఖాయం. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ తర్వాత కల్కి బుకింగ్స్ మరిన్ని పెరిగాయి.

కల్కి సినిమాపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే సినిమాను ఎక్కడా ఔట్ రేట్ కు ఇవ్వలేదు. అన్నీ అడ్వాన్సుల మీదే ఇచ్చారు. నిర్మాత అశ్వనీదత్ ఈ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. తన గత సినిమాల్ని కూడా ఇలానే అడ్వాన్సుల మీద ఇచ్చి భారీ లాభాలు అందుకున్నారాయన.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల బిజినెస్ రేషియో 180 కోట్ల రేంజ్ లో ఉంది. మిగిలిన సౌత్ ఇండియా దాదాపు 50 కోట్లు, నార్త్ ఇండియా 100 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ దాదాపు 100 కోట్లు. బ్రేక్ ఈవెన్ కోసం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్‌ సాధించాల్సిన అవసరం ఉంది. అంటే, దాదాపు 500 కోట్ల రూపాయల షేర్ రావాలన్నమాట. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు. కాబట్టి హిట్ అవ్వాలంటే, సలార్, బాహుబలి-2 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

ముంబయిలో చేసిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ మినహా, సినిమాకు పెద్దగా ఈవెంట్లు ప్లాన్ చేయడం లేదు. ముంబయిది కూడా కేవలం ప్రెస్ మీట్ మాత్రమే. దానికి ప్రీ-రిలీజ్ అని పేరు పెట్టారు. ఇప్పుడీ సినిమా ప్రచారం మొత్తం కల్కి రెండో ట్రయిలర్ పైనే ఆధారపడి ఉంది. మరికొన్ని గంటల్లో ఆ ట్రయిలర్ రాబోతోంది. ఇక దిశా పటానీ, ప్రభాస్ పై తీసిన సాంగ్ ను ఆఖరి నిమిషంలో రిలీజ్ చేస్తారట.




Tags:    
Advertisement

Similar News