Kalki Movie | వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్

Kalki Movie - ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. తాజాగా ఇది వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది.

Advertisement
Update: 2024-07-13 17:27 GMT

ప్రభాస్, అమితాబ్ బచ్చన్ 'కల్కి' మూడవ వారంలోకి ఎంటరై బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకుంది, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు ఇప్పుడు రూ.1000 కోట్ల గ్లోబల్ క్లబ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. కల్కి సౌత్ ఇండియన్ సినిమాల్లో నాన్-బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా, హిందీ బెల్ట్, ఇతర భాషలలో కూడా ఘన విజయాన్ని అందుకుంది.

ఈ చిత్రం నార్త్ అమెరికాలో 17 మిలియన్ డాలర్ల మార్కును దాటింది, ఇది ఇప్పటికే ఈ ప్రాంతంలో నాన్-బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, కెనడాతో పాటు మరికొన్ని ఇతర దేశాల్లో కూడా నాన్ - బాహుబలి-2 హిట్ గా నిలిచింది కల్కి.

కల్కి సాధించిన హిస్టారికల్ సక్సెస్ తో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్, హను రాఘవపూడితో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. వీటిలో రాజాసాబ్ ముందుగా విడుదలకానుంది.

Tags:    
Advertisement

Similar News