డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ప్రభాస్
సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. "మన కోసం బ్రతికేవాళ్లు ఉన్నారు... ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్" అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు. రేపు జనవరి 1 కాబట్టి ఈరోజు రాత్రి ఈవెంట్స్ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఓ సందేశంతో ప్రభాస్ వీడియో వచ్చింది. జీవితంలో మనకు బోలెడన్ని ఆనందాలు ఉన్నాయని.. లైఫ్‌లో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని డార్లింగ్ తెలిపారు. మనల్ని ప్రేమించే, మన కోసం బతికేవాళ్లు ఉన్నప్పుడు.. జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలకు నో చెప్పాలని పిలుపునిచ్చారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలు అయితే టోల్‌ఫ్రీ నంబర్ 8712671111కు కాల్ చేయాలని సూచించారు.
డ్రగ్స్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బాధితులు కోలుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలోని పెద్దలతో సమావేశమైన సీఎం రేవంత్.. తెలంగాణ రైజింగ్ లో సినీ ఇండస్ట్రీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని, మహిళా భద్రత క్యాంపెయిన్ విషయంలో చొరవ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలోనూ ఇండస్ట్రీ నుంచి సహకారం కావాలని సూచించారు.