పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక జీవితంలో రాజకీయాలు మాట్లాడను అని ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, నన్ను తిట్టరా.. అవి నేను పట్టించుకోనని పోసాని అన్నారు.
ఏ పార్టీనో తిట్టడానికి రాజకీయాల్లోకి రాలేదని పోసాని స్పష్టం చేశారు. ఇకపై ఏ పార్టీని కూడా పొగడను అని.. అలాగే విమర్శించను అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో ఇక నుంచి తనకు సంబంధం లేదన్నారు పోసాని. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కొంత కాలంగా ఆయనపై ఏపీలో కూటమి నేతలు కేసులు పేడుతున్నా సంగతి తెలిసిందే. పోసాని గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు.
Advertisement