పుష్ప- 2 నుంచి పీలింగ్స్ లిరికల్‌ సాంగ్‌ విడుదల

పుష్ప- 2 సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. పీలింగ్స్' అనే సాంగ్ ని తాజాగా విడుదల చేశారు.

Advertisement
Update:2024-12-01 19:01 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప 2 ఈ చిత్రం నుంచి పీలింగ్స్ సాంగ్ విడుదలైంది. హీరోయిన్ రష్మికతో అల్లు అర్జున్‌ మాస్ ఊరమాస్‌ స్టెప్పులతో సాగుతున్న ఈ పాట థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. తాజాగా పీలింగ్స్‌ సాంగ్‌ కూడా రికార్డుల మోత మోగించడం ఖాయమని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో శంకర్‌బాబు కందుకూరి, లక్ష్మి దాస పాడారు.

ఇటీవలే విడుదల చేసిన కిస్సిక్ ఐటెంసాంగ్‌ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా నిలుస్తోంది. మరోవైపు ఇప్పటికే లాంచ్ చేసిన పుష్ప పుష్ప పుష్ప సాంగ్‌, సూసేకి పాటలు కూడా బ్లాక్‌ బస్టర్ టాక్‌ తెచ్చుకున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే. రేపు యూసఫ్ గూడా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో పుష్ప- 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా యూసఫ్ గూడా పరిసరా ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News