ఓటీటీ వాచ్ లిస్ట్ – ‘హనుమాన్’ హిందీ, ‘భ్రమయుగం’ మాలయాళం వచ్చేశాయ్!

ఈవారం ఓటీటీల్లో తెలుగు సినిమాల్లేవు. రెండు హిందీ సినిమాలు, 5 ఇంగ్లీషు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Advertisement
Update:2024-03-12 13:34 IST

ప్రతీ రోజూ ఓటీటీల్లో ఏ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలతో హడావిడీ కనిపిస్తూంటుంది. థియేట్రికల్ రిలీజుల కంటే ఓటీటీ స్త్రీమింగ్స్ గురించే వార్తలు...గతవారం ‘గామి’ ఇంకా థియేటర్స్ లో విడుదల కాకముందే స్ట్రీమింగ్ ఎప్పుడనే వార్తలు నిండిపోయాయి. సినిమాల్ని థియేటర్స్ లో ఊపిరి తీసుకోనివ్వకుండా ఓటీటీ స్ట్రీమింగ్స్ గురించి డిజిటల్ స్పేస్ ని నింపేస్తున్నారు. అనాలోచితంగా ఈ అత్యుత్సాహం దేనికో? సినిమాల థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించి కనీసం 30 రోజుల విండో అయినా వుంది. డిజిటల్ మీడియాలో మాత్రం ఏ విండో లేకుండా, థియేటర్స్ లో నాలుగు రోజులైనా ఆడనివ్వకుండా, వెంటనే రిలీజ్ రోజు నుంచే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే...అని దాడి మొదలైపోతుంది. ఒకవైపు ఫస్ట్ డే ఫస్ట్ షో నడుస్తూంటే, కీ బోర్డు మీద వెబ్ సైట్స్ వేళ్ళు చకచకా పని చేస్తూంటాయి - ఫలానా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అని! ఈ ట్రెండ్ కి ఫుల్ స్టాప్ ఎప్పుడో?

ఈవారం ఓటీటీల్లో తెలుగు సినిమాల్లేవు. రెండు హిందీ సినిమాలు, 5 ఇంగ్లీషు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంగ్లీషులో ఇంట్రెస్టింగ్ సినిమా ‘ఆర్ట్ ఆఫ్ లవ్’. ఇది రోమాంటిక్ డ్రామా. తన మాజీ ప్రియురాలు దొంగ అని తెలుసుకున్న తర్వాత, ఆమెని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్లాన్‌తో వచ్చే ఇంటర్‌పోల్ అధికారి కథ. ఇక ‘హనుమాన్’ హిందీ వెర్షన్, మలయాళం ‘భ్రమ యుగం’ కూడా స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. అలాగే హిందీలో ‘మర్డర్ ముబారక్’ కూడా ఇంట్రెస్టింగ్ సినిమా. పూర్తి లిస్ట్ కోసం ఈ క్రింద చూడండి...

నెట్ ఫ్లిక్స్ లో 9

1. జీసస్ రివల్యూషన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 12

2. టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ డాక్యు సిరీస్) -మార్చి 12

3. బండిడోష్ (స్పానిష్ సిరీస్) -మార్చి 13

4. 24 అవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ మూవీ) -మార్చి 14

5. గర్ల్స్ 5ఎవా -సీజన్3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14

6. చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) -మార్చి 15

7. ఐరిష్ విష్ (ఇంగ్లీష్ కామెడీ మూవీ) -మార్చి 15

8. ఐరన్ రీన్ (స్పానిష్ థ్రిల్లింగ్ సిరీస్) -మార్చి 15

9. మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) -మార్చి 15

అమెజాన్ ప్రైమ్ లో 4

1. లవ్ అధూరా (హిందీ సిరీస్) - మార్చి 13

2. బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) -మార్చి 14

3. ఇన్విన్సజిబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్) -మార్చి 14

4. ఫ్రిడా (ఇంగ్లీష్ డాక్యూ బయోపిక్) -మార్చి 15

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 3

1. గ్రేస్ అనాటమీ : సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) -మార్చి 15

2. సేవ్ ది టైగెర్స్ సీజన్ 2 ( తెలుగు సిరీస్) -మార్చి 15

3) టేలర్ స్విఫ్ట్: ది ఏరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) -మార్చి 15

4. క్యారీ ఆన్ జట్టా 3 (కామెడీ సిరీస్)- మార్చి 16

సోనిలివ్ లో 1

1. భ్రమ యుగం -మార్చి 15

జీ 5 లో 1

1. మై అటల్ హూ (హిందీ మూవీ) -మార్చి 14

ఆపిల్ ప్లస్ టీవీలో 1

1. మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) -మార్చి 15

బుక్ మై షోలో 1

1. ది డెవిల్ కాన్స్ పిరసీ (ఇంగ్లీష్ సినిమా) -మార్చి 15

జియో సినిమాలో 2

1. హనుమాన్ (హిందీ వెర్షన్) -మార్చి 16

2. ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ యానిమేషన్) -మార్చి 17

లయన్స్ గేట్ ప్లేలో 1

నో వే అప్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీ )- మార్చి 15 

Tags:    
Advertisement

Similar News