Devara | కాస్త ముందుగానే దేవర రిలీజ్

Devara Movie - లెక్కప్రకారం దేవర సినిమా దసరా కానుకగా విడుదల కావాలి. కానీ ఇప్పుడీ చిత్రాన్ని 2 వారాల ముందే విడుదల చేస్తున్నారు.

Advertisement
Update:2024-06-13 22:34 IST

ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

తాజాగా దేవర సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించారు. రెండు భాగాలుగా వస్తున్న దేవర సినిమాలో మొదటి భాగాన్ని సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ అన్ని పనులు కొలిక్కి రావడంతో 2 వారాల ముందే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

తాజా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌తో ‘దేవర’ చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఎన్టీఆర్ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, కొర‌టాల శివ టేకింగ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు,ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో ఎన్టీఆర్ నటిస్తుండగా.. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌ల‌ు పోషిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ