వంద కోట్ల క్లబ్‌లో 'లక్కీ భాస్కర్'
ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోస్టర్‌ను పంచుకున్న చిత్రబృందం
తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కి సినిమాలు భారీ విజయాలు సాధించడమే కాకుండా రికార్డు కలెక్షన్లు రాబట్టడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే సుమారు రూ. 30 కోట్లతో తెరకెక్కిన 'లక్కీ భాస్కర్' మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 111 కోట్లకు పైగా (గ్రాస్) వసూలు చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందం పోస్టర్‌ను పంచుకున్నది. దీపావళి కానుకగా ఈ మూవీ అక్టోబర్ 21న ముందుకొచ్చింది. మూడోవారంలోనూ సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమతున్నది.
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ డైరెక్షన్‌లో వచ్చిన 'లక్కీభాస్కర్' మూవీ విజయవంతంగా ప్రదర్శితమౌతున్నది. అటు ప్రేక్షకుల ఆదరణతో పాటు సినీ ప్రముఖల ప్రశంసలు అందుకుంటున్నది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌గా నిలిచిపోతుందంటున్నారు. మీనాక్షి చౌదరి కూడా నటకు మంచి అవకాశం ఉన్న పాత్ర పోషించారని ప్రశంసిస్తున్నారు. అలాగే జీవీ ప్రకాశ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నది.
'లక్కీభాస్కర్' కథ ఏమిటంటే?
1980-90ల్లో బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో డైరెక్టర్ ఈ మూవీని తీర్చిదిద్దారు. భాస్కర్ అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి.. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఎలాంటి రిస్క్ చేశాడనే కథతో దీన్ని తెరకెక్కించాడు. అతని భార్యగా సుమతి పాత్రలో మీనాక్షి చౌదరి నటకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పోషించారు. డైరెక్టర్ వెంకీ మేకింగ్, దుల్కర్ యాక్టింగ్‌ను ఇప్పటికే సినీ ప్రముఖులు మెచ్చుకున్నారు.