కొండా సురేఖకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్

నాకు పొలిటికల్ పార్టీ, ఏ వ్యక్తితో సంబంధం లేదని బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ క్లారిటీ ఇచ్చింది.

Advertisement
Update:2024-10-03 18:47 IST

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌‌ను బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఖండించారు. గౌరప్రదమైన స్థానంలో ఉన్న మహిళ ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు వ్యాప్తి చేయడం బాధాకరం. వారి రాజకీయ లబ్ధి కోసం నా పేరును కూడా ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నా..నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేరేకిని. నాకు పొలిటికల్ పార్టీ ఏ వ్యక్తితో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మకతకి.. నైపుణ్యానికి టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రతీకగా చూస్తున్నారు. నేను ఈ ఇండస్ట్రీలో చాలా కాలం ప్రయానించాను ఇంకా అది కొనసాగిస్తున్నాను. ఇటువంటి ఇండస్ట్రీలో మహిళల గురించి నిరాధారమైన దుర్మార్గమైన పుకార్లు వినడం బాధాకరంగా ఉంది.

మరి దారుణమైన విషయం ఏంటంటే అవి ఇంకొక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ నుండి వినడం ఇంకా మనసు విరిచేసేలా ఉంది. గౌరవం కోసం మ‌నం నోరు తెరవకుండా ఉంటే దాన్ని మా బలహీనతగా చూస్తున్నారు. రాజకీయాల కోసం ఇలాంటి కల్పిత స్టోరీలు ముడిపెట్టడాన్ని ఆపేయాలి అని రకుల్ కోరారు. నా పేరు ని తప్పుడు ఆరోపణలతో మీ రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయండి. ఆర్టిస్ట్‌ల‌ను ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉంచండి. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్‌లైన్‌ల కోసం అర్థం లేని క‌థ‌ల్లో మ‌మ్మ‌ల్ని లాగ‌కండి అంటూ ర‌కుల్ చెప్పుకోచ్చింది. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలిసిందే

Tags:    
Advertisement

Similar News