Saripodhaa Sanivaram | ఇది నిజంగా టీజర్ కాదు

Saripodhaa Sanivaram - నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజైంది.

Advertisement
Update: 2024-07-20 17:08 GMT

ఎస్ జే సూర్య ఇటీవల తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా అనేక పాత్రలు పోషించారు. "సరిపోదా శనివారం" చిత్రంలో కూడా అతడు విలన్ గా కనిపించబోతున్నాడు. అతడి పాత్ర ఓ దుర్మార్గపు పోలీసు ఆఫీసర్ పాత్ర. ఎస్ జే సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ ఈ రోజు టీజర్‌ను విడుదల చేసారు, దానిని వారు “టీజర్ కాదు” అని పేరు పెట్టారు.

శతాబ్దాల క్రితం నరకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడని నాని చెప్పడంతో వీడియో ప్రారంభమవుతుంది. అతనిని అంతమొందించడానికి కృష్ణుడు సత్యభామతో కలిసి వస్తాడు. ఆధునిక నేపధ్యంలో, నాని-ప్రియాంక మోహన్ ను కృష్ణ-సత్యభామ గా చూపించడం బాగుంది. వీళ్లిద్దరూ కలిసి సూర్యను ఎలా ఎదుర్కొన్నారనేది స్టోరీ. సూర్యకు నాని తనదైన శైలిలో హ్యాపీ బర్త్ డే చెప్పడం బాగుంది. ఎస్ జే సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీజర్ ముగుస్తుంది.

వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతకుముందు నాని-వివేక్ కాంబోలో అంటే సుందరానికి సినిమా వచ్చింది. ఇది రెండోది. జేక్స్ బెజోయ్ తన ఇంటెన్స్ మ్యూజిక్ స్కోర్‌తో విజువల్స్‌ కు మరింత అందం తీసుకొచ్చాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 29న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

తాజా వీడియోకు టీజర్ కాదు అని ట్యాగ్ లైన్ పెట్టడం బాగుంది. ఎందుకంటే, టీజర్ అనేది ప్రత్యేకంగా, హీరోపై వస్తుంది. అది ఆల్రెడీ వచ్చేసింది. అందుకే దీనికి 'టీజర్ కాదు అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

Full View

Tags:    
Advertisement

Similar News