Nani | నా బ్యాక్ గ్రౌండ్ చిరంజీవి

Nani - తనకు చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ ఉందంటున్నాడు నాని. దానికి అతడు చెప్పే లాజిక్ ఏంటో చూద్దాం..

Advertisement
Update: 2024-08-28 08:43 GMT

రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్.. ఇలా మెగా హీరోలందరికీ బ్యాక్ గ్రౌండ్ చిరంజీవి. మరి నాని పరిస్థితేంటి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. అయితే తనకు కూడా చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ ఉందంటున్నాడు ఈ హీరో.

"రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కు చిరంజీవి బ్యాక్ గ్రౌండ్. నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదనుకుంటారు. అయితే నిజానికి వీళ్లందరికీ చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ కాదు, బర్డెన్. చిరంజీవి స్ఫూర్తితో నేను సినిమాల్లోకి వచ్చాను. ఆయనే నాకు బ్యాక్ గ్రౌండ్. ఒకవేళ నా యాక్టింగ్ ను చిరంజీవితో కంపేర్ చేస్తే అది నాకు చాలా ఆనందం. కానీ మెగా హీరోల విషయానికొస్తే.. చిరంజీవితో వాళ్లను కంపేర్ చేస్తారు. ఆ బరువు మోయడం వాళ్లకు చాలా కష్టం. ఈ విషయంలో నాపై అంత ఒత్తిడి ఉండదు. కాబట్టి చిరంజీవి వాళ్లకు భారం, నాకు బ్యాక్ గ్రౌండ్."

చిరంజీవి నటించిన ప్రతి సినిమా చూశానని, తన యాక్టింగ్ పై మెగాస్టార్ ప్రభావం ఉందని అంటున్నాడు నాని. కేవలం చిరంజీవి కాకుండా.. ఒక్కో సినిమా నుంచి ఒక్కొక్కర్ని స్ఫూర్తిగా తీసుకుంటానని, వాళ్ల ద్వారా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటానని అన్నాడు. కమల్ హాసన్, రజనీకాంత్, మణిరత్నం, మమ్ముట్టి.. లాంటి చాలామంది హీరోలకు తను ఏకలవ్య శిష్యుడ్ని అని ప్రకటించుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News