బాల‌య్య ఈజ్ బ్యాక్‌.. ప‌రుగులు పెడుతున్న NBK109 షూటింగ్‌

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి తో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement
Update: 2024-06-29 04:32 GMT

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. NBK109 వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంతరం బాబీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తుండగా.. థ‌మ‌న్‌ స్వరాలు అందిస్తున్నాడు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో సెట్స్ మీద‌కు వెళ్లిన ఎన్‌బీకే 109 మూవీ మార్చి వ‌ర‌కు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంది.

అయితే ఇంత‌లోనే ఏపీలో ఎన్నిక‌లు రావడంతో హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి శాస‌న‌సభ‌కు పోటీ చేస్తున్న బాల‌య్య.. షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగం అయ్యారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల హ‌డావుడి మొత్తం ముగిసింది. బాల‌య్య ఎమ్మెల్యేగా గెల‌వ‌డ‌మే కాకుండా.. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదే త‌రుణంలో బాల‌య్య ఈజ్ బ్యాక్ అయ్యారు. మ‌ళ్లీ ఎన్‌బీకే 109 షూటింగ్ ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప్ర‌స్తుతం బాబీ-బాల‌య్య సినిమా షూటింగ్ కర్నూల్ జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్లో జరుగుతుంది. ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ను అక్క‌డ‌ చిత్రీక‌రిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు లోకేష‌న్ కు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో పోలీస్ బందోబస్తు నడుమ షూటింగ్ ను జ‌రుపుతున్నారు.

Tags:    
Advertisement

Similar News