మా నాన్న దేవుడు.. కానీ నేడు చూస్తున్నది మా నాన్నను కాదు

ఆస్తుల కోసం మా నాన్నతో గొడవ పడుతున్నానేది వాస్తవం కాదన్న మంచు మనోజ్‌

Advertisement
Update:2024-12-11 11:38 IST

తాను ఇంట్లోని వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదని సినీనటుడు మంచు మనోజ్‌ అన్నారు. సొంతంగా వ్యాపారం చేసి సంపాదించుకుంటున్నట్లు చెప్పారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. జల్‌పల్లిలో ఆయన మీడియా మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీదే ఆధారపడలేదని, సొంతకాళ్ల పనిచేసుకుంటున్నాను అని తెలిపారు.ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెలల కుమార్తెను లాగుతున్నారు. నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడగలేదు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించకుంటున్నామని చెప్పారు. అలాగే ఆస్తుల కోసం మా నాన్నతో గొడవ పడుతున్నానేది వాస్తవం కాదు. మా నాన్న దేవుడు.. కానీ ఈ రోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఈ రోజు పోలీసు విచారణకు హాజరవుతున్నాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరా దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ అనంతరం మిగతా విషయాలు వెల్లడిస్తాను. నిన్న మా నాన్న దాడిలో గాయపడిన జర్నలిస్టుకు నేను క్షమాపణ చెబుతున్నాను అని మంచు మనోజ్‌ తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News