'లక్కీ భాస్కర్' ను మెచ్చుకున్న మెగాస్టార్
సినిమా నచ్చడంతో డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి
బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో తెరకెక్కిన తాజా మూవీ 'లక్కీ భాస్కర్'. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్నది. ఈ మూవీపై ఇప్పటికే సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చూశారు. సినిమా తనకెంతో నచ్చడంతో దర్శకుడు వెంకీ అట్లూరిని ప్రత్యేకంగా కలిశారు. మూవీ మేకింగ్, చిత్రబృందం పనితీరును మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. 'మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ సినిమా చూసి.. వర్క్‌ను అభినందిస్తే.. మీరు ప్రత్యేకంగా ఏదో సృష్టించారని తెలుస్తోంది' అని పేర్కొన్నది.
'లక్కీభాస్కర్' కథ ఏమిటంటే?
1980-90ల్లో బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో డైరెక్టర్ ఈ మూవీని తీర్చిదిద్దారు. భాస్కర్ అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి.. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఎలాంటి రిస్క్ చేశాడనే కథతో దీన్ని తెరకెక్కించాడు. అతని భార్యగా సుమతి పాత్రలో మీనాక్షి చౌదరి నటకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పోషించారు. డైరెక్టర్ వెంకీ మేకింగ్, దుల్కర్ యాక్టింగ్‌ను మెచ్చకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.