గిన్నిస్ బుక్‌ రికార్డులోకి మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.

Advertisement
Update:2024-09-22 18:12 IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. మెగాస్టార్ తన 45 ఏళ్ల సినీ కెరీర్‌లో 156 సినిమాల్లో నటించి 537 సాంగ్స్‌లో 24,000 డ్యాన్స్ స్టెప్పులతో అలరించినందుకు ఈ పురస్కారం లభించినట్లు గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలో మరే నటుడూ ఇన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసిన దాఖలాలు లేవు. చిరంజీవి 1978 సెప్టెంబరు 22న తన కెరీర్ ప్రారంభించారు. మరే నటుడికి సాధ్యం కాని రీతిలో అత్యధిక స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేశారు.

ఇవాళ హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరైన చిరంజీవికి రికార్డును అందజేశారు. చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేతులమీదుగా అందుకోవడం విశేషం. కాగా, ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్, సుస్మిత, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News