మోహన్ బాబు నుంచి మాకు భద్రత కల్పించండి
అడిషనల్ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కోరిన మంచు మనోజ్
Advertisement
మోహన్ బాబు కుటుంబ వివాదం రచ్చకెక్కింది. మోహన్‌బాబు, మంచు మనోజ్ మధ్య విభేదాలు సమసి పోతాయనుకుంటే మంగళవారం విష్ణు ఎంట్రీతో మనోజ్, ఆయన భార్య మౌనికను ఇంట్లో నుంచి బయటకు పంపారు. మనోజ్ కు చెందిన సామగ్రిని మూడు లారీల్లో జల్‌పల్లిలోని నివాసం నుంచి బయటికి పంపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ అభ్యర్థను పట్టించుకోలేదని ఉదయం మంచు మనోజ్ మీడియా ఎదుట వాపోయాడు. ఇంట్లో నుంచి తండ్రి, అన్న పంపించడంతో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలను మనోజ్, మౌనిక దంపతులు కలిశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తామిద్దరి ఇంట్లో నుంచి బయటకు పంపేశారని, జల్‌పల్లిలోనే తమ పిల్లలను ఉంచుకొని తమకు ఇవ్వడం లేదని తెలిపారు. రాచకొండ సీపీని కలిసి ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.
Advertisement