Manchu Manoj | మంచు మనోజ్ సినిమా వస్తోంది

Manchu Manoj - లాంగ్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ నుంచి ఓ సినిమా వస్తోంది. మిరాయ్ నుంచి అతడి ఫస్ట్ లుక్ రిలీజైంది

Advertisement
Update: 2024-05-20 17:14 GMT

రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఎనిమిదేళ్ల విరామం తర్వాత వెండితెరపై కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'మిరాయ్‌'లో తన లేటెస్ట్ లుక్ తో సూపర్ హీరో యూనివర్స్ ని 'ది బ్లాక్ స్వోర్డ్'గా అభివర్ణిస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇందులో ఓ కీలక పాత్రలో (తాజా సమాచారం ప్రకారం విలన్ గా) కనిపించనున్నాడు మంచు మనోజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తునారు. మంచు మనోజ్ సినిమా చేసి ఎన్నాళ్లయింది? దీనికి సమాధానం చెప్పడం కష్టం. చాలా ఏళ్ల కిందటే అతడు సినిమాలు ఆపేశాడు. మార్కెట్ పడిపోవడంతో పాటు, వ్యక్తిగత కారణాల వల్ల మంచు మనోజ్ సినిమాలకు దూరమయ్యాడు.

ఈమధ్యే మళ్లీ గ్లామర్ వరల్డ్ లోకి ఎంటరయ్యాడు. ఓ సినిమా చేస్తున్నాడు. కానీ అతడి మూవీస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమా మిరాయ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు మంచు మనోజ్.

అతడి పాత్ర ఫస్ట్ లుక్ అందరికీ బాగా నచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ఇదే. ఈ సినిమాతో పాటు అతడు వాట్ ది ఫిష్ అనే మూవీ కూడా చేస్తున్నాడు. కానీ ఆ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఈటీవీ విన్ కోసం పీపుల్ మీడియాతో కలిసి ఓ షో చేస్తున్నాడు.

Full View

Tags:    
Advertisement

Similar News